చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): సంకష్టహర చతుర్థి సందర్బంగా శనివారం చందానగర్ లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీలక్ష్మీ గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, అర్చన, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీ సిద్ది బుద్ది సమేత శ్రీ వరసిద్ది వినాయక స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.







