శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శనివారం పలువురు నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ తెరాస నాయకులు, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకుడు మిరియాల రాఘవరావు, చందానగర్ డివిజన్ వేమన కాలనీ వాసులు, ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ వాసులు, ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస నాయకుడు కాశీనాథ్ యాదవ్, హఫీజ్‌పేట్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు గౌతం గౌడ్, నాయకుడు వెంకటేష్ గౌడ్ లు గాంధీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.






శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎల్. శంకర్, మహేందర్ రెడ్డి, పి.శివకుమార్, బలరాం, సి.పి.రెడ్డి, పులిందర్ రెడ్డి, రమణ కుమారి, దుర్గా భవాని, బి.రవీందర్, వి.నర్సింహ్మ చారి, టి.గోపాల్ పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు నాగేషప్ప, శివ, వినయ్, బిక్షపతి, కృష్ణంరాజు లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, యువ నేత రాగం అనిరుధ్ యాదవ్ లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జి.రవీందర్ రావు, మిరియాల రాఘవరావు, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కొయ్యాడ లక్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, పట్లోళ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వర్ రావులకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, తెరాస పార్టీ ముఖ్య నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.



ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ కాలనీ నాయకులు ప్రవీణ్, బోస్, పున్నయ్య చౌదరి, శేఖర్, ప్రవీణ్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

శేరిలింగంపల్లిలోని గోపీనగర్‌లో ఉన్న జన చైతన్య ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పెంటయ్య, సత్యనారాయణ, రాజేందర్, కృష్ణ, తుకారాం, అర్జున్, శరణప్ప, అశోక్, మారుతి పాల్గొన్నారు.






