శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సరం సందర్భంగా నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్, యువ నాయకుడు రవి కుమార్ యాదవ్ ల చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారితో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, 2021వ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు, బిజెపి కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వినోద్ రావు, అనంత రెడ్డి, ఎల్లేష్, కొంచ శివ రాజ్ ముదిరాజ్, జి మల్లేష్, బాబు ముదిరాజ్, సారా రవీందర్, జాజిరావు రాము, వంశీ ముదిరాజ్, మూర్తి, రమేష్, సోను కుమార్ యాదవ్, శివ, నరేష్, శ్రీధర్ పాల్గొన్నారు.