పేద‌ల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ అండ‌: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆప‌ద‌లో ఉన్న పేద‌ల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేస్తుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శేరిలింగంప‌ల్లి ప‌రిధిలోని మాదాపూర్ డివిజ‌న్‌కు చెందిన ఎండీ వసీంకు రూ.60వేలు, చాంప్లి బాయికి రూ.10వేల విలువైన సీఎం రిలీఫ్ ఎల్‌వోసీ ప‌త్రాల‌ను మంగ‌ళ‌వారం ఆయ‌న ఎంపీ గ‌డ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేట‌ర్లు జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, నార్నె శ్రీ‌నివాస రావుల‌తో క‌లిసి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ పేద‌లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వెంట‌నే స‌హాయం అందిస్తున్న‌ట్లు తెలిపారు. పేద‌ల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని తెలిపారు.

బాధితుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్లు జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, నార్నె శ్రీ‌నివాస రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here