ఆయువ్, బాలాజీ ఫౌండేషన్ లు సంయుక్తంగా సేవా కార్యక్రమాలపై దృష్టి

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రోహిత్ ముదిరాజ్ సోమవారం బాలాజీ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ సంఘ సేవకుడు బలరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో రెండు ఫౌండేషన్ లు కలిసి చేయాల్సిన సేవా కార్యక్రమాలపై వారు ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా బలరాం రోహిత్ ముదిరాజ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు భాను ముదిరాజ్, ప్రతినిధులు కార్తీక్, జగదీష్ పాల్గొన్నారు.

బాలాజీ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బ‌ల‌రాంను క‌లిసిన ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రోహిత్ ముదిరాజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here