మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ కుంట చెరువు సుందరీకరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ.31.26 కోట్ల వ్యయంతో పటేల్ కుంట చెరువు, గంగారాం పెద్ద చెరువుల సుందరీకరణ పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే చెరువుల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పనులు చేపడుతున్నామని అన్నారు. త్వరలోనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.







