గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో డివిజన్ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని డివిజన్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవికుమార్ యాదవ్ హాజరయ్యారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ గా గెలిచిన గంగాధర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి తనను గెలిపించిన డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ లో పార్టీని బలోపేతం చేయాలని, అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవీంద్ర ప్రసాద్ దూబే, జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా నాయకులు వసంత్ కుమార్ యాదవ్, మీన్ లాల్ సింగ్, నరేందర్ ముదిరాజ్, సంతోష్ సింగ్, శ్రీనివాస్ చారి, పీవీఆర్‌ఎస్ నరసింహా రావు, కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, మహేశ్వరి, వరమ్మ, ఇందిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 200 మంది కార్యకర్తలు శంకర్ నాయక్, చందర్ నాయక్, గోపాల్ నాయక్, రాజు నాయక్‌ల ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.