శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని 11కేవీ దూబే కాలనీ ఫీడర్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫీడర్ పరిధిలోని ఆదర్శ్ నగర్, గోపీనగర్, సురభి కాలనీ, ప్రశాంత్ నగర్, బాపు నగర్, దూబే కాలనీలలో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాపిరెడ్డి ఫీడర్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలలో కరెంటు ఉండదని తెలిపారు.





