మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మంగళవారం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ కలిసి శ్రీశ్రీశ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని గాంధీని జగదీశ్వర్ గౌడ్ కోరారు.






