శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గా రాగం నాగేందర్ యాదవ్ రెండోసారి గెలుపొందిన సందర్భంగా మంగళవారం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్ కుమార్, వర్క్ ఇన్ స్పెక్టర్లు మహేష్, యాదగిరిలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు వారు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డివిజన్ లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. పెండింగ్ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని అధికారులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు.






