శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌కు వికారాబాద్ జిల్లా ఉపసర్పంచ్ ల సంఘం ఉపాధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా యాదవ మహాసభ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాగం నాగేందర్ యాదవ్‌ను భేరి రామ చందర్ యాదవ్ ఆదివారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులకు నామినేటెడ్ పోస్ట్ లలో అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత యాదవ కులస్తులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులలో యాదవ కులస్తులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీకి యాదవ సంఘాల పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల ఉపాధ్యక్షుడు అందెల సత్యనారాయణ యాదవ్, లంగర్ హౌజ్ అఖిలభారత యాదవ సంఘం అధ్యక్షుడు ఆరేళ్ల శ్రీశైలం యాదవ్, గిరి యాదవ్ పాల్గొన్నారు.





