శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి పట్టభద్రుడి ఓటు ఎంతో కీలకమని ఎమ్మెల్సీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి శంభీపూర్ రాజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మియాపూర్ డివిజన్‌కు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అట్టేపల్లి రామప్రభుతో పాటు డివిజన్ సీనియర్ నాయకులు కలిదిండి రోజా, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, కొంచ శివరాజ్, గోపరాజు శ్రీనివాస్, మరపు గంగాధర్, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఏఆర్‌పీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓట్లు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటర్లను చైతన్యవంతం చేయాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయడంతో పాటు, పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.





