ప్రశాంత్ నగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు పర్యటన

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ప్రశాంత్ నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని అట్టేపల్లి రామప్రభు హామీ ఇచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ప్రశాంత్ నగర్ కాలనీవాసులు స్పందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఏఆర్‌పీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here