మహిళ వైద్య చికిత్సకు రూ.2 లక్షల సీఎం సహాయ నిధి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అత్యవసర వైద్య చికిత్స కోసం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన చాగంటి పూలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన LOC మంజూరు పత్రాన్ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి బాధిత కుటుంబానికి ఈ పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని గాంధీ తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, అత్యవసర వైద్య సేవలు పొందేందుకు ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here