మియాపూర్ శ్రీరంగాపురం కాలనీలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు.. పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ దేవి శరన్నవరాత్రి-దసరా ఉత్సవాల్లో భాగంగా మియాపూర్‌లోని శ్రీరంగాపురం కాలనీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీ ప్రెసిడెంట్ కేశవ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ హాజరయ్యారు. కేశవ్ రావు ఆహ్వానం మేరకు ఉత్సవాల్లో పాల్గొన్న ఉదయ్ కిరణ్ జగన్మాత శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి హారతి సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, శరన్నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కేశవ్ రావును అభినందించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సమృద్ధిగా వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మూర్తి, రెడ్డి, ప్రసాద్, నరసింహ, చరణ్, శరత్, వంశీ, రత్నాచారి, సతీష్, శశి తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here