శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్లో యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.






