శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శేరిలింగంపల్లికి చెందిన ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జన్మదినం జరుపుకున్న చిర్రా రవీందర్ యాదవ్కు ఈ సందర్భంగా కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో భాగంగా చిర్రా రవీందర్ యాదవ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిమను కేటీఆర్కు బహూకరించారు. అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.

శేరిలింగంపల్లి ప్రాంతంలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న మార్పులు, స్థానిక అంశాలు, భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్కు చిర్రా రవీందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.





