రోజూ నడకతో ఆరోగ్యం.. రోగాలకు దూరంగా ఉండొచ్చు: కసిరెడ్డి భాస్కరరెడ్డి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రతిరోజూ నడకను అలవాటుగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, అనేక అనారోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని బీజేపీ రాష్ట్ర నాయకుడు, జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ నడకకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గౌతమీనగర్ కాలనీలోని అస్మిత ఆర్థో స్పైన్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కసిరెడ్డి భాస్కరరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన పాల్గొన్న వారితో కలిసి సుమారు రెండు కిలోమీటర్లు నడిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో అనేక ఆసుపత్రులు వ్యాపార ధోరణితో పనిచేస్తున్న పరిస్థితుల్లో, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అస్మిత ఆర్థో స్పైన్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడిన తర్వాత చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లడం కంటే, ముందుగానే ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ నడక వంటి వ్యాయామాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. గౌతమీనగర్, శిల్పా ఎన్‌క్లేవ్ కాలనీల్లో నినాదాలు చేస్తూ నడక కార్యక్రమాన్ని కొనసాగించారు. మీ ఆరోగ్యం కోసం – నడవండి అనే సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి భాస్కరరెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, నందనం విష్ణుదత్త్, రాజ్ జైశ్వాల్, లక్ష్మణ్, నవీన్, కార్తీక్, తనవ్, శ్రీరాం, విష్ణుశర్మ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here