వేముకుంటలో మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వేముకుంటలోని గౌతమినగర్‌ మహాశక్తి శ్రీ లలితా పోచమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చనలో సుమారు 400 మంది మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం 1 గంటకు సుమారు 1,200 మంది భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జాయింట్‌ సెక్రటరీ కట్ల శేఖర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గౌతమినగర్‌ కాలనీ అధ్యక్షుడు రాఘవ, కార్యదర్శి ప్రసాద్‌, శివప్రసాద్‌, పి. నారాయణ కిషోర్‌, శివ యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డి, గాంధీ చౌదరి, ముక్తేశ్వర్‌రావు, రాఘ‌వయ్య, యాదయ్య, జగదీష్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే 50 మంది భవానీ దీక్ష భక్తులు, చుట్టుపక్కల కాలనీలకు చెందిన భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేవాలయ ట్రస్టీలు గుర్రపు రవీందర్‌రావు, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here