శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంఘం పటేల్ భవన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఫంక్షన్ హాల్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పటేల్ భవన్ను నిర్మించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌకర్యాలతో ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లలో వేలాది రూపాయలు ఖర్చు చేయలేని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫంక్షన్ హాల్ను నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అధిక ఖర్చులు భరించలేని కుటుంబాలకు పటేల్ భవన్ ఎంతో తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నాగం స్వామి, నాగం మల్లికార్జున్, రౌతు కనకయ్య, మాధవరం నర్సింగ్ రావు, గాలి అనిల్, శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, టుడి ప్రవీణ్, సంపత్, సల్ల కృష్ణ, రేగుల రాజు, చందు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






