శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ నిర్వహించిన ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ కవిత వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళల ఉత్సాహం, బతుకమ్మ పాటలు, సంప్రదాయ నృత్యాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. వేడుకల్లో భాగంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కల్వకుంట్ల కవిత స్వయంగా బహుమతులు అందజేశారు. దీంతో మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.






