కూకట్‌పల్లిలో ఘనంగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు శివారెడ్డి జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, వ్యాపారవేత్త, బిల్డర్‌ శివారెడ్డి జన్మదిన వేడుకల‌ను కూకట్‌పల్లిలో ఘనంగా నిర్వహించారు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలోని శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ వినాయక మండపం వద్ద, సూర్య ఉదయం ప్రెస్‌ కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించారు. అనుదీప్‌ రెడ్డి, సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు, నాయకులు హాజరై శివారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను శివారెడ్డి కట్‌ చేసి, సన్నిహితులు, అభిమానులతో కలిసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

అనంతరం నిర్వాహకులు శివారెడ్డిని శాలువాతో సన్మానించి, భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివారెడ్డి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి సమాజ అభివృద్ధికి తనవంతు కృషి చేయాలని కోరారు. శివారెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఆనందం, ఐశ్వర్యం కలగాలని పలువురు ఆకాంక్షించారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత గుర్తింపు పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని అన్నారు. ఇదే విధమైన ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై కొనసాగాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకం, అభిమానంతో అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు మధుసూదన్‌ రెడ్డి, ఉపేందర్‌ రెడ్డి, తులసి రెడ్డి, అనుదీప్‌ రెడ్డి, సాయినాథ్‌ రెడ్డి, ఆదిరెడ్డి, రమణారెడ్డి, తిరుపతి చారి, పాత్రికేయులు హేమంత్‌ సాగర్‌, సంతోష్‌ కుమార్‌, శ్యాంసుందర్‌, సునీల్‌ కుమార్‌, క్రాంతి, శ్రీకాంత్‌ రెడ్డి, అరుణ రెడ్డి, లక్ష్మీ రెడ్డి, పాల్‌ రాజు, రాజేష్‌ తదితరులు పాల్గొని శివారెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here