శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో ముదిరాజ్ యూత్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరాలను సిద్ధింపజేసే వరసిద్ధి వినాయకుడి నవరాత్రి వేడుకలు ఉత్సాహానికి, ఉజ్వల సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. గణేష్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. యువత గణేష్ మండపాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో గచ్చిబౌలి డివిజన్ ప్రజలు అభివృద్ధి, సుఖసంతోషాలు, శ్రేయస్సు సాధించాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగస్వామి ముదిరాజ్, మధు ముదిరాజ్, శివ, సాయి, శ్రీకాంత్, పవన్, సోనూ, రాజేష్, వెంకట్ తదితర పార్టీ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు, మహిళలు, పిల్లలు, కాలనీ వాసులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





