శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని కోరుతూ నేరెళ్ల లేక్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రాంగణంలో జంగం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరెళ్ల లేక్‌కు వచ్చిన వాకర్స్‌కు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నివారణకు మట్టి విగ్రహాల వినియోగం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగం గౌడ్, ఎగ్గని నరసింహ, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి రాజు, ట్రెజరర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.







