8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్‌ను కలిసిన షేక్ చాంద్ పాషా

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషా 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌కు శుభాకాంక్షలు తెలియజేసి అభినందనలు తెలిపారు. కమాండెంట్‌తో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు బి. సత్యనారాయణ, సునీల్, ఎస్. రాంబాబు, ఆర్‌ఐ పూర్ణచంద్రరావు, ఎస్‌ఐ సత్యనారాయణ, మహేందర్ రెడ్డి తదితర అధికారులను కూడా షేక్ చాంద్ పాషా కలిశారు. ఈ సందర్భంగా బెటాలియన్‌కు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి సేవలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ షేక్ చాంద్ పాషా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, ప్రసాద్ గుప్తా, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here