105 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి మండల పరిధిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, వెంకటేశ్వరనగర్ డివిజన్లకు చెందిన 105 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన రూ.1,05,12,180 ఆర్థిక సహాయాన్ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడం సంతోషకరమైన విషయమన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడబిడ్డలకు పెద్ద అన్నగా అండగా నిలుస్తున్నారని గాంధీ పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు సంతోషంగా జరిగేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళ‌లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here