శేరిలింగంపల్లి కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా మండగడ్డ నర్సింగ్ రావు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్‌కు చెందిన మండగడ్డ నర్సింగ్ రావును శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు ర‌మాకాంత్ రావు నర్సింగ్ రావుకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ పట్ల నర్సింగ్ రావుకు ఉన్న నిబద్ధత, సేవాభావంతో సేవాదళ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here