శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): హిందూ మతం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, శ్రీ శ్రీ శ్రీ సత్యానందేంద్ర స్వామీజీతో టిటిడి ధార్మిక పరిషత్తు మాజీ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. చందానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా స్వామీజీ ఆశీర్వచనం చేస్తూ.. హిందూ మతం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కూడా నిలబడగలిగిందంటే దానికి ప్రధాన కారణం దాని బలమైన పునాదులు, దృఢమైన సంకల్పం, సంఘటిత శక్తేనని పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ కేంద్రంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని స్వామీజీలు అభిప్రాయపడ్డారు. హిందూ సమాజ ఐక్యత, ధార్మిక చైతన్యం కోసం అనేక రకాల కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు స్వామీజీ భక్తులు పాల్గొన్నారు.





