వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయం: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని బాపు నగర్‌లో నిర్వహించారు. ఎన్‌ఎన్ రెడ్డి టెక్స్టైల్ బోటిక్ ప్రొప్రైటర్ కుషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడుగు, బలహీన వర్గాలు, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, నిరుపేదలకు పెన్షన్లు వంటి పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని అన్నారు.

విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో పేదలకు అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడిగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేమన్నారు. వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న కుషన్ రెడ్డిని ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ అభినందించారు. కార్యక్రమంలో సూర్యచంద్ర రెడ్డి, ప్రభాస్ హోటల్ ప్రొప్రైటర్ చెన్నమరాయుడు, కొండకల్ పుష్పక రెడ్డి, కనిగిరి ఏపీ మల్లికార్జున్ రెడ్డి, దశరథ రెడ్డి, హతిరామ్, శ్రమశక్తి అవార్డు గ్రహీత, శేరిలింగంపల్లి వైఎస్సార్ పార్టీ ఇన్‌చార్జ్ మహేశ్వర్ రెడ్డి, మౌలానా, చంద్రశేఖర్, ఉత్తంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here