శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటూ ఆరోపిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మదీనాగూడ డివిజన్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సీతా రామరాజు, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్‌చార్జి నందనం విష్ణు దత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు మహేష్ యాదవ్ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్టులను నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.






