శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డితో పాటు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.






