సీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్.. 19 అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అక్ర‌మ నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. శ‌నివారం సీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి అక్ర‌మ నిర్మాణాలపై చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో మొత్తం 26 అనధికార నిర్మాణాలను గుర్తించగా.. 19 నిర్మాణాలను కూల్చివేశారు. మరో 12 నోటీసులు జారీ చేశారు. గుర్తించిన మిగిలిన 7 అనధికార నిర్మాణాలపై నిర్దేశిత విధానం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సీఎంసీ అధికారులు తెలిపారు.

జోన్‌ల వారీగా కూల్చివేతల వివ‌రాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లి జోన్‌లో 9, కూక‌ట్‌ప‌ల్లిలో 4, కుత్బుల్లాపూర్‌లో 6 నిర్మాణాల‌ను అధికారులు కూల్చివేశారు. భవన నిర్మాణ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు సీఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో అక్ర‌మ నిర్మాణాలను గుర్తిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను కొనసాగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గుర్తించిన నిర్మాణాలపై వర్తించే నిబంధనలు, నిర్దేశిత విధానాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here