శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (నమస్తే శేరిలింగంపల్లి): రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ విశిష్టతను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. మహిళల ఆత్మీయతకు మిరియాల ప్రీతమ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారికి స్వీట్లు, చీరలు పంపిణీ చేసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజిని, తులసి, ధనలక్ష్మి, బ్రహ్మకుమారి సమాజానికి చెందిన సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.






