శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల విభాగం హెడ్‌గా నాయబ్ తహసీల్దార్ (ఎలక్షన్స్) విరాజ్ శాక్యను నియమిస్తూ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రొసీడింగ్స్ నంబర్ 45/52-ఏసీ/ఎస్ఎల్పీ/సి-49/జీహెచ్ఎంసీ/2025తో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వుల ప్రకారం.. విరాజ్ శాక్య తక్షణమే బాధ్యతలు స్వీకరించి, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, నివేదికలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం, మీడియా వ్యవహారాలు, సందేహాల నివృత్తి తదితర అంశాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఎన్నికల విభాగంలో విధులు నిర్వహించిన ప్రీతిబా సింగ్, ప్రేమ్ కుమార్‌లను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ, వారు తమకు కేటాయించిన ఏఈఆర్ఓ విధులను కొనసాగించాలని ఆదేశించారు.





