ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే.. మియాపూర్‌లో అట్టేపల్లి రామప్రభు పర్యటన

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని పెబుల్స్ బే అపార్ట్‌మెంట్స్‌ను అట్టేపల్లి రామప్రభు సందర్శించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులతో ఆత్మీయంగా సమావేశమై స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యలు, మౌలిక వసతులు, అభివృద్ధి అంశాలపై నేరుగా చర్చించారు. అపార్ట్‌మెంట్ వాసుల నుంచి సమస్యలను తెలుసుకున్న రామప్రభు.. ప్రజా సమస్యలను కార్యాలయాలకే పరిమితం చేయకుండా ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం బాధ్యతగా ముందుకు సాగడమే తమ విధానమని తెలిపారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, సమస్యల పరిష్కారంతో పాటు మియాపూర్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ వాసులు మందేపూడి వెంకటేశ్వర్లు, మొవ్వ కృష్ణ ప్రసాద్, కాకర్ల మధు, చావ రాధాకృష్ణ, చందన నరేంద్ర, సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ARP టీమ్ సభ్యులు అడప అజయ్, అట్టేపల్లి ప్రశాంత్, కడారి రాజు, ఎం. సాయి గౌడ్, కె. శ్రీను, టి. ప్రదీప్, శేఖర్ ముదిరాజ్, పి. వెంకటస్వామి, సత్యం, పవన్ చక్రవర్తి, ఎన్. చంద్రశేఖర్, పింటు కుమార్, నాని, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here