శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (నమస్తే శేరిలింగంపల్లి): రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా బ్రహ్మకుమారీస్ మహిళలు PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా గాంధీ వారికి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. సోదరి తన అన్నయ్య లేదా తమ్ముడికి ప్రేమకు చిహ్నంగా రాఖీ కట్టడం, సోదరుడు జీవితాంతం తన సోదరికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు.

రక్షా బంధన్ అంటే రక్షణ బంధం అని గాంధీ పేర్కొన్నారు. సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే అపురూపమైన పండుగగా రాఖీ పండుగను అభివర్ణించారు. సోదరి తన అన్నయ్య లేదా తమ్ముడు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ కట్టే పవిత్రమైన బంధమే రాఖీ అన్నారు. రాఖీ కేవలం ఒక దారం కాదని, ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, బాధ్యత, రక్షణ వంటి విలువలను గుర్తుచేసే పవిత్రమైన బంధానికి ప్రతీక అని గాంధీ అన్నారు. కుటుంబాల్లో ప్రేమానురాగాలు, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని, ప్రతి సోదరుడు, సోదరి జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ రక్షా బంధన్ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషాన్ని నింపాలని, సోదర సోదరీమణుల మధ్య అనుబంధం మరింత బలపడాలని కోరుకుంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు.





