శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (నమస్తే శేరిలింగంపల్లి): మసీద్‌బండలోని బీజేపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్‌లకు పలువురు బీజేపీ మహిళా నాయకురాళ్లు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హఫీజ్‌పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష, మహేష్ యాదవ్, అంజయ్యనగర్ బీజేపీ నాయకురాలు ఆమని, వివిధ డివిజన్లకు చెందిన మహిళా నాయకురాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్‌లకు రాఖీలు కట్టారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఒకరికొకరు రక్షణగా నిలుస్తూ సంతోషాలను పంచుకునే విశిష్టమైన పండుగ రక్షాబంధన్ అని పేర్కొన్నారు. తోడబుట్టిన బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు సమాజంలో సోదరభావం, పరస్పర రక్షణ భావనను పెంపొందించడంలో రాఖీ పౌర్ణమి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్, దేవాల్ యాదవ్, సీతారామరాజు, జితేందర్, రాజు యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






