శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్య కారణాలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లిలోని నెహ్రూ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పవన్ (30) గత కొంత కాలంగా ఫిట్స్ సమస్యతో బాధపడుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఎలాంటి పని చేయడం లేదు. స్థానికంగా ఉన్న చెరువు వద్దకు వెళ్లి నీళ్లలోకి దిగగానే అతనికి ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిట్స్ ఉన్న కారణంగా ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.






