గచ్చిబౌలిలో సెప్టెంబర్ 4 నుంచి జాతీయ హాకీ పోటీలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి హాకీ క్రీడా మైదానంలో సెప్టెంబర్ 4 నుంచి 14వ తేదీ వరకు 6వ హాకీ ఇండియా సీనియర్ మెన్ ఇంటర్ డిపార్ట్‌మెంట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హాకీ ప్రతినిధులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ బత్తిని సురేశ్‌ను కలిసి పోటీలకు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ఇతర విభాగాలకు చెందిన 20 జట్లు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నట్లు తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్, కార్యదర్శి భీం సింగ్ తెలిపారు. గచ్చిబౌలి హాకీ మైదానంలో జరిగే ఈ టోర్నమెంట్‌లో దేశంలోని పలువురు ప్రముఖ హాకీ క్రీడాకారులు, క్రీడా ప్రముఖులు పాల్గొననున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా చాంపియన్‌షిప్ నిర్వహణకు సంబంధించిన వివరాలను బత్తిని సురేశ్‌కు తెలంగాణ హాకీ ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here