శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): బుధవారంసాయంత్రం సుమారు 7 గంటల సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌లోని 6వ నంబర్ ప్లాట్‌ఫాం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అతను గోదుమ రంగు టీషర్ట్, నలుపు రంగు నిక్కరు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తుపట్టిన వారు చందానగర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.






