శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం గ్రామంలో సుమారు 45-55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గత కొన్ని రోజులుగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో యాచిస్తూ జీవిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనారోగ్యం, ఆకలితో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని గుర్తించిన వారు లేదా అతని కుటుంబ సభ్యులు, బంధువుల గురించి సమాచారం ఉన్న వారు చందానగర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే చందానగర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.






