శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ యువ నాయకుడు ధాత్రీనాథ్ గౌడ్ తన సతీమణి సింధుతో కలిసి ప్రజయ్ సిటీలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలోని NMG సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ప్రజయ్ సిటీ పార్క్లో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ధాత్రీనాథ్ గౌడ్, సింధు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడంతో పటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో NMG సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, దేశభక్తి భావాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.





