యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి: శ్రీనివాస్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మాదాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో జాతీయ జెండాలను ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మాదాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను పౌరులు పొందుతూ సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.

దేశ భవిష్యత్తులో యువత పాత్ర అత్యంత కీలకమని, దేశ అభివృద్ధిలో యువత చురుకుగా భాగస్వాములు కావాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. అదే సమయంలో అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు భిక్షపతి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, రాఘవ రెడ్డి, కృష్ణ మాదిగ, వెంకటేశ్వర రావు, మొహమ్మద్ బాబూమియా, షేక్ బాబూమియా, సలీమ్ ఖాన్, నర్సింహారావు, విజయలక్ష్మి, కృష్ణ యాదవ్, రూబిన్ గౌడ్, రాహుల్, రాజేందర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, వసంత్, నవీన్, వినోద్ రెడ్డి, మదనాచారి, సాంబయ్య, సంజీవ రెడ్డి, మస్తాన్, చంద్, అశోక్, రాజు, ఇమ్రాన్, గౌస్, రవూఫ్, అరవింద్, రాజా, నీలేష్, అఖిల్, వినోద్ యాదవ్, మహేందర్, చందర్, సలీమ్, బాలరాజ్, సీతమ్మ, యాదమ్మ, కృష్ణ ముదిరాజ్, సుధాకర్ ముదిరాజ్, కృష్ణ నాయక్, బ్రహ్మయ్య యాదవ్, కోటేష్, అలీం, మోయిన్, రషీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here