శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మియాపూర్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సురక్ష కా తిరంగా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో భాగంగా మియాపూర్‌లోని డి మార్ట్‌లో సైబర్ కమ్యూనిటీ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది డి మార్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, UPI/QR కోడ్ మోసాలు, ఫిషింగ్, ఫేక్ లింకులు, APK/KYC మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్‌పై పోలీసులు అవగాహన కల్పించారు. అలాగే డిజిటల్ అరెస్ట్, ఫేక్ కస్టమర్ కేర్, జాబ్, లోన్ ఫ్రాడ్స్, సైబర్ బుల్లీయింగ్, సైబర్ స్టాకింగ్, సెక్స్టార్షన్, సెక్స్టింగ్, సోషల్ మీడియా, వాట్సాప్ మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అపరిచిత వ్యక్తులతో OTPలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లు, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. సైబర్ ఆర్థిక మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని మియాపూర్ పోలీసులు సూచించారు.





