విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ పాపిరెడ్డి కాల‌నీ రాజీవ్ గృహ కల్ప‌లోని బ్లాక్ 47 రూమ్‌లో నివాసం ఉంటున్న సునీల్ రాథోడ్‌, స్వ‌ప్న దంప‌తుల‌కు ముగ్గురు కుమారులు. వారిలో రెండో సంతాన‌మైన గ‌ణేష్ రాథోడ్ (2) మంగ‌ళ‌వారం త‌మ అపార్ట్‌మెంట్ ఎల‌క్ట్రిక్ మీట‌ర్ల బోర్డు వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ తెరిచి ఉన్న బాక్సుల్లోని వైర్ల‌ను ప‌ట్టుకోవ‌డంతో విద్యుదాఘాతానికి గుర‌య్యాడు. తీవ్ర‌గాయాల పాలైన అత‌న్ని చికిత్స నిమిత్తం వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అత‌ను అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్దారించారు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అపార్ట్‌మెంట్ విద్యుత్ మీట‌ర్ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉన్న ఇనుప కంచెను తెరిచి ఉండ‌డం వ‌ల్ల అందులోకి వెళ్లిన బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here