శేరిలింగంపల్లి, జూలై 28 (నమస్తే శేరిలింగంపల్లి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురై చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అట్టేపల్లి రామప్రభు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఓదార్చుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో తమ పూర్తి మద్దతు కుటుంబానికి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకన్న, బోయిని మహేష్ యాదవ్, ఫ్లోరెన్స్, ఎడ్ల కల్పన, అడప అజయ్, అట్టేపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






