శేరిలింగంపల్లిలో ఐ కిడ్జ్ ప్రీస్కూల్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డోయెన్స్ కాలనీ, హౌస్ నం.313లో గోధా గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ కిడ్జ్ ప్రీస్కూల్ ను శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌తో కలిసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రీస్కూల్ విద్యేనని అన్నారు. ఐ కిడ్జ్ వంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్యాసంస్థలు శేరిలింగంపల్లి డివిజన్‌లో ఏర్పాటు కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు ఆటపాటల ద్వారా విజ్ఞానాన్ని అందించే ఈ విద్యాసంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లలకు ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

గోధా గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎ బ్రైట్ బిగినింగ్‌, ఎండ్‌లెస్ పాసిబిలిటీస్ అనే నినాదంతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గోధా గ్రూప్ నిర్వాహకులు నరేందర్ యాదవ్, చంద్రకళ, చంద్రశేఖర్ యాదవ్, రుచిక యాదవ్, తేజేందర్ యాదవ్‌లను రాగం నాగేందర్ యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, లింగారెడ్డి, రవి యాదవ్, రవీంద్ర చారి, లింగంపల్లి విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, మల్లేష్, ఐలాపూర్ మాణిక్ యాదవ్, సతీష్, లక్ష్మయ్య, కిరణ్ యాదవ్, మహేందర్ సింగ్, అజ్మత్ అజ్జు, సాయి చరణ్‌, నిర్వాహకుల కుటుంబ సభ్యులు హర్షిత యాదవ్, షణ్ముఖ్ యాదవ్, శ్యామ్ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, నర్సింగ్ యాదవ్, నారాయణ్ దాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here