శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు విష్ణువర్దన్ చారిని పార్టీ నాయకుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పరామర్శించారు. గురువారం రాత్రి టూవీలర్‌పై ప్రయాణిస్తున్న విష్ణువర్ధన్ కు లింగంపల్లి ఫ్లై ఓవర్ పై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు కాగా హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. అశోక్‌నగర్‌లో ఉన్న శ్రీవేద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విష్ణువర్ధన్‌ను శుక్రవారం వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పరామర్శించి యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నరు. అనంతరం విష్ణువర్ధన్‌కు రూ.25వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనకు కావల్సిన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చంద్రశేఖర్ ప్రసాద్ స్పష్టం చేశారు. విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.






