చందానగర్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ సర్వే పరిశీలన

శేరిలింగంప‌ల్లి, జూలై 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ వార్డులో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా సర్వేను ERO, అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు AERO, మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, BLO సూపర్‌వైజర్లు, BLOలు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ నం.119 పరిధిలో నిర్వహిస్తున్న సర్వే పురోగతిని పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. BLOలు కోరిన అవసరమైన సమాచారం, పత్రాలను అందించి సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here