శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించాలనే లక్ష్యంతో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత షూస్, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మియాపూర్ పరిధిలోని స్టాలిన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీ స్కూల్)లో ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

సమాజ సేవే లక్ష్యంగా అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, అన్నదానం, పర్యావరణ పరిరక్షణ, దోమల నివారణ కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతే సమాజ అభివృద్ధికి పునాది అనే సంకల్పంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం, శ్రీరాములు, శ్రీహరి, శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, శోభారాణి, ఎంపీపీ స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్లయ్య, టి. నాగేశ్వర్, తిరుపతమ్మ, సుష్మిత, ఏఏపీసీ చైర్మన్ భాగ్యమ్మ, మోహన్, సాయిగౌడ్, శ్రీను, రామ్ రెడ్డి, టి. ప్రదీప్, శ్రీశైలం, శేఖర్, హనుమంతు, తరుణ్, నవీన్, పి.శ్రీను, రాజు, లావణ్య, ఏఆర్‌పీ టీమ్ సభ్యులు, అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.





